Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మండల వ్యవసాయశాఖ అధికారి శరత్ బాబు
నవతెలంగాణ-బోనకల్
యాసంగి వరికు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేయాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శరత్ బాబు రైతులను కోరారు. మండల పరిధిలోని ఆళ్లపాడు, ముష్టికుంట్ల, రావినూతల, గార్లపాడు, రాపల్లి, మోటమర్రి గ్రామాలలో రైతులకు వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి వంటలపై సిబ్బందితో పాటు రైతులకు మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ఆహార సంస్థ(ఎఫ్సీఐ) యాసంగిలో పండించే వడ్లను కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిందని, ఈ సంవత్సరం కొనుగోలు కేంద్రాలు ఉండవని, రైతులందరు ఆరుతడి పంటలు వైపు మొగ్గు చూపాలని కోరారు. సాధారణంగా వానకాలం వరి కోత అనంతరం మినుము పంట సాగు తగు సత్ఫలితాలను ఇస్తుందని, తేమను పట్టి ఉంచే అన్ని రకాల నేలలో అనుకూలమని, బరువు నేలలు అత్యంత శ్రేయస్కరం అన్నారు. నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకు వరి మాగాణులలో మినుమును సాగుచేయవచ్చునని తెలిపారు. ఎకరాకు 6 -7 కేజీల విత్తనం అవసరం అవుతుందని తెలిపారు. అనువైన రకాలు పీయూ-31, ఎల్బిజీ-752, ఎల్బీజి 787 రకాలు మంచి దిగుబడిని ఇస్తాయని తెలిపారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు ద్వారా ఎకరాకు 4-8 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చునని సూచించారు.
దేశవాళీ రకాలు:-జేజి 11, నంద్యాల శేనగ-47, జెజి:130 వంటి రకాలు మంచి దిగుబడినిస్తాయని తెలిపారు. ఎకరాకు 6-12 క్వింటాల్ దిగుబడి వస్తుందని తెలిపారు. యాసంగిలో అధిక విస్తీర్ణంలో సాగు చేసే ఆరుతడి పంటల్లో వేరుశెనగ ఒకటని తెలిపారు. ఎర్ర చల్కా నెలల్లో అత్యంత అనుకూలం అని అన్నారు. కదిరి 6, కదిరి 1812, కదిరి 9 వంటి రకాలు మంచి దిగుబడులిస్తాయని తెలిపారు. ఈ అవగాహన సదస్సులో వ్యవసాయ విస్తరణ అధికారులు ఎర్రగుంట సాధన, దారగాని కళ్యాణి, మురుకుట్ల తేజ, బండి శ్రీకాంత్, గూగులోతు గోపి, నాగినేని నాగసాయి ఆయా గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.
యాసంగిలో వరి సాగు వద్దు
నేేలకొండపల్లి : యాసంగిలో రైతులు వరి సాగు చేయవద్దని ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి ఎస్.వి.కె నారాయణరావు అన్నారు. మంగళవారం మండలంలోని పైనంపల్లి, చెరువుమాదారం, కోరట్లగూడెం, అనాసాగరం, కట్టుకాచారం, భైరవునిపల్లి, శంకరగిరితండ, సదాశివపురం గ్రామాలలో