Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తరగతులు కూడా చర్లలోనే ఏర్పాటు చేయాలి
నవతెలంగాణ- చర్ల
చర్ల మండలానికి కేటాయించిన ఏకలవ్య పాఠశాల భవనాన్ని త్వరగా నిర్మించి, బోధన కూడా చర్లలో ప్రారంభించాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, కుంజా సత్యవతి, ఐటీడీఏ పిఓ గౌతమ్కి మంగళవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థుల కోసం భద్రాచలం నియోజకవర్గం లోని చర్ల మండలానికి ఏకలవ్య పాఠశాల మంజూరు చేసింది. భవన నిర్మాణం ఇంతవరకు నిర్మించ లేకపోవడం వలన ఏకలవ్య పాఠశాల తరగతి బోధనలు భద్రాచలం లో జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పాఠశాలను మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడం వలన ఏకలవ్య పాఠశాలలో నిర్మించడంలో జాప్యం జరుగుతుందని ఆమె పిఓ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్థలం సేకరించి ఏకలవ్య పాఠశాల భవనాన్ని నిర్మించాలని అప్పటివరకు ప్రభుత్వ లేదా ప్రైవేట్ బిల్డింగ్ అద్దెకు తీసుకొని త్వరలోనే చర్లలో ఏకలవ్య పాఠశాల తరగతి బోధన చేపట్టాలని ఆమె తెలిపారు. పిఓ సానుకూలంగా స్పందించి ఏకలవ్య పాఠశాల కచ్చితంగా చర్లలొనే ఉంటుందని, ఎక్కడకీ తరలించబోమని, 9.50 ఎకరాలు స్థలం కేటాయించామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట క్రాంతి కుమార్, జిల్లా కార్యదర్శి నాగబాబు , రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.