Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డిప్యూటీ డీఎంహెచ్ఓ వీరబాబు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఒమిక్రాన్ ధర్డ్వేవ్ పట్ల వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ వీరబాబు సూచించారు. మంగళవారం దుమ్ముగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆశా డే కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మండలంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాలు వేసుకునే విధంగా ఆశా కార్యకర్తలు గ్రామాల్లో అవగాహన కల్పించడంతో పాటు ఒమిక్రాన్ ధర్డ్వేవ్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు సలహాలు అందజేయాలన్నారు. అసుపత్రిలో మలేరియా వ్యాధితో జాయిన్ అయిన చిన్నారిని పరీక్షించారు. అనంతరం వైద్యశాలలో రికార్డులు పరీశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట దుమ్ముగూడెం వైద్యాధికారి బాలాజీ నాయక్, హెచ్ఈఓ కృష్ణయ్య, సబ్ యూనిట్ అధికారి హన్మంతు, సూపర్వైజర్ అమ్మాజీలతో పాటు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.