Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఆంక్షలు విధిస్తూ రైతును నట్టేట
ముంచుతున్న పాలకులు
అ రైతే రాజంటూనే కూలీని చేస్తున్న
కేంద్ర, రాష్ట్ర్ట ప్రభుత్వాలు
అ రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా,
కలెక్టర్‌కు వినతి
నవతెలంగాణ-కొత్తగూడెం
వరి రైతును ఇబ్బందులు పెట్టే చర్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మానుకోవాలని, అన్నంపెట్టే రైతన్నను కన్నీరు పెట్టించే చర్యలను సహించబోమని రైతు సంఘాల జిల్లా నేతలు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని, ఆంక్షలు ఎత్తివేయాలని, తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని, పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్స్‌ను కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ వరి పంట సాగుపై ఆంక్షలు విధిస్తూ రైతులను పరోక్షంగా ఆత్మహత్యలకు ఉసిగొల్పుతున్నారన్నారని విమర్శించారు. సాగుపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాలతో చర్చలు జరిపి సంబందిత వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పించకుండా అర్ధాంతరంగా వరిసాగు చేయోద్దని ప్రకటించడం ఎంత మేరకు సమంజసమన్నారు. వరిసాగుచేసే పొలాల్లో ఏ పంటలు వేయాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. ప్రస్తుతం చేతికొచ్చిన వరిప ంటను కోతకోసుకునేందుకు కూడా రైతుకు అర్హత లేదంటూ టోకెన్లు జారీ చేసి వారు చెప్పిన తేదీల్లో కోతలు కోయాలని చెప్పడం, కొనుగోలుకు ఓడీపీ పద్ధతిని ప్రవేశపెట్టడం దేశచరిత్రలో తొలిసారని విమర్శించారు. వర్షాలు వచ్చి పంటలు నష్టపోతే ప్రభుత్వం భాద్యత వహిస్తుందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తూచాతప్పకుండా పాటిస్తూ కేసీఆర్ మోడీతో కుమ్మక్కా య్యాడన్నారు. తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండించిన ప్రతి విత్తనాన్ని కొనుగోలు చేసే విదంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి బ్రహ్మం, రైతు కూలి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముద్ద బిక్షం, న్యూడెమోక్రసి నాయకులు మాచర్ల సత్యం, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి బాలరాజు, న్యూడెమోక్రసి పట్టణ కార్యదర్శి పి.సతీష్, నాయకులు నిమ్మల రాంబాబు, ఎన్.సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.