Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఏజే రమేష్
నవతెలంగాణ-ఇల్లందు
ఇండ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం భూమిని ఇచ్చి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని పేదలకు కాకుండా కార్పొరేట్ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని ఇస్తే ప్రతిగటిస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు ఏజే రమేష్ హెచ్చరించారు. ఇల్లందు మండలం సీఎస్పీ బస్తి గ్రామపంచాయతీ రాజీవ్ నగర్ గ్రామం భూ పోరాట కేంద్రం వద్ద ఉన్న మంగళవారం మండల కమిటీ సభ్యులు వజ్జ సురేష్ అధ్యక్షతన వర్కుషాప్ నిర్వహించారు. సభనుద్దేశించి వారు మాట్లాడుతూ పేదలు వేసుకున్న గుడిసెలను ధ్వంసం చేసి పెద్దలకు కట్ట బెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని, పేదల భూమిని ఇంచు ఆక్రమించుకున్న సీపీఐ(ఎం) నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని అన్నారు. అర్హులైన వారందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ఢిల్లీ రైతాంగం స్ఫూర్తితో ఇండ్ల స్థలాల పోరాటం నిర్వహించాలని పిలుపునిచ్చారు. నేడు దేశంలో పాలకులు ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పరిశ్రమలను చౌకగా ఆదాని, అంబానీలకు అమ్మేస్తున్నారని, పేదలపై ఉక్కు పాదం మోపుతున్నారని అన్నారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, కూరగాయల ధరలు పెంచి తిండికి దూరం చేస్తున్నారని అన్నారు. పేదలకు కూడు, గూడు, బట్ట దొరికే వరకు ఉద్యమించాలని అన్నారు. పార్టీ జిల్లా, రాష్ట్ర, అఖిల భారత మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటి ఇంటికీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించి సీపీఐ(ఎం) చేస్తున్న పోరాటాల గురించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించనున్నట్లు వారు తెలిపారు. ఈ సభలో మండల కార్యదర్శి అబ్దుల్ నబి, సీనియర్ నాయకులు దేవులపల్లి యాకయ్య, తాళ్లూరి కృష్ణ, అలెటి కిరణ్, వజ్జ సురేష్, మన్నెం మోహన్ రావు, వెంకటమ్మా, రాందాస్, వాసం రాము, మరియ తదితరులు పాల్గొన్నారు.