Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా
మేనిఫెస్టోని అమలు చేయలేదు
అ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పోతినేని సుదర్శన్రావు
అ ఘనంగా సీపీఐ(ఎం) మండల మహాసభ
నవతెలంగాణ-జూలూరుపాడు
బీజేపీ ప్రభుత్వం కుల, మతాల మధ్య చిచ్చు పెడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా ఇంకా మానిఫెస్టోని అమలు చేయలేదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. మంగళవారం మండలంలోని గుండెపుడి గ్రామంలో సీపీఐ(ఎం) మండల 8వ మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతినేని హాజరై మాట్లాడారు. ఆరంభానికి ముందు భానోత్ ఇస్రా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజలకు చేసిందేమీ లేదని, కేంద్ర ప్రభుత్వం నూతన రైతు చట్టాలు తీసుకొచ్చి దేశాన్ని అతలాకుతలం చేసిందన్నారు. రైతు చట్టాలను రద్దు కోసం సీపీఐ(ఎం) అనుబంధ సంఘాలు ముందుండి పోరాడాలని అన్నారు. కరోనా కష్టకాలంలో ఏ ఒక్క కుటుంబానికి కూడా ప్రభుత్వాలు ఆదుకో లేదన్నారు. కమ్యూనిస్టు దేశాలు అయినటువంటి ఐదు దేశాలు కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, పేదలను ఆదుకొని పేద కుటుంబాలకు అండగా నిలిచారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా తమ ప్రకటించిన మేనిఫెస్టో ఇంకా అమలు చేయలేదని విమ ర్శించారు. పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటా యిస్తామని, కనీసం ఇచ్చిన ఇల్లు కూడా సక్రమంగా లేవని అన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తా మని అనేకమార్లు చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, జాటోత్ కృష్ణ మండల నాయకులు కనకరత్నం వెంకటి, వెంకటేశ్వర్లు, నరేష్, చందర్, మధు, ఇస్రా శ్రీను, సుగుణ, రాధాకృష్ణ, రాములు, శేషమ్మ, గోవిందు, సుబ్బయ్య, పద్మ, అభిమిత్ర, పవన్ కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.