Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నవీన జ్యోతి
నవతెలంగాణ-గుండాల
కళాశాలలో అడ్మిషన్లు, హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నవీన జ్యోతి అన్నారు. ఈ విషయమై మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు కళాశాలలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 206 ఉన్నప్పటికీ హాజరు శాతం తక్కువగా ఉంటుందని, అందుకు కారణం విద్యార్థులు వ్యవసాయ పనులకు వెళ్లడం, తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై దృష్టి పెట్టకపోవడమేనని చెప్పారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు హాస్టల్ వసతి కూడా ఉందని, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు రావాలని కోరారు. కళాశాలలో అడ్మిషన్లు, హాజరు శాతం పెంచేందుకు విద్యార్థుల ఇండ్లకు వెళ్లి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. హాజరు శాతాన్ని పూర్తి స్థాయిలో పెంచేందుకు ఈ నెల 14న విద్యార్థుల తల్లిదండ్రులతో మీటింగ్ ఏర్పాటు చేస్తు న్నామని, అందుకు విద్యార్థుల తలిదండ్రులు తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కళాశాల స్టాప్ టి.బాలస్వామి, ఎం.చైతన్య, జె.రవిందర్ నాయక్, ఎం.సతీష్ రెడ్డి, ఎస్.క్రిష్ణమాచారి, ఆర్.రఘు, కె.నాగేశ్వరరావు, ఎం.మల్సూర్, ఎం.సురేష్ తదితరులు పాల్గొన్నారు.