Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం
రాష్ట్రంలో మహిళలపై, మైనర్ బాలికలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకూ పెరుగుతూ పాత రూపాలతోపాటు కొత్త రూపాలుగా మారుతూ మహిళలను మరింత హింసకు గురిచేస్తున్నాయని కుటుంబ న్యాయ సలహా కేంద్రం రాష్ట్ర కార్యదర్శి బుగ్గవీటి సరళ అన్నారు. మంగళవారం ఖమ్మంలో కుటుంబ న్యాయ సలహా కేంద్రం ఆధ్వర్యంలో మహిళలపై హింస మారుతున్న రూపాలు అనే అంశంపై సదస్సు కన్వీనర్ మెరుగు రమణ అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ మహిళలపై అత్యాచారాలు జరిగిన సందర్భాలలో మద్యం, మాదక ద్రవ్యాలు సేవించినట్లు రుజువు అవుతుందని, దీనికి పోర్న్ వెబ్సైట్స్, (అశ్లీల వెబ్సైట్లు), అశ్లీల చిత్రాలు కూడా అత్యాచారాలు పెరగడానికి కారణమవుతున్నా యన్నారు. గతంలో మహిళలపై అత్యాచారం మాత్రమే చేసేవారు. కానీ ప్రస్తుతం సాక్ష్యాలు లేకుండా చేయడం కోసం పెట్రోల్ పోసి తగులబెట్టి చంపుతున్నారన్నారు. ఆడవాళ్ళ ప్రాణం అంటే లెక్క లేకుండా పోయిందన్నారు. స్త్రీలు కరోనా నేపథ్యంలో ఆర్థిక అవసరాలకు అప్పు తీసుకుంటే బంధువులు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. భరించలేక మహిళలు ఆత్మ హత్యలు చేసుకుంటున్న ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగాయన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర కోశాధికారి బత్తుల హైమావతి, ఐద్వా రాష్ట్ర నాయకురాలు అఫ్రోజ్ సమీనా, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బండి పద్మ, మాచర్ల భారతి, ట్రస్ట్ సభ్యురాలు, న్యాయవాది అంజలి, డాక్టర్ పొన్నం ప్రియాంక ఐద్వా జిల్లా నాయకురాలు నాగ సులోచన తదితరులు పాల్గొన్నారు.