Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల
నవతెలంగాణ-రఘునాధపాలెం
మండల వ్యాప్తంగా గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ యాసంగి పంట కాలంలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు పద్ధతుల గురించి రైతులకు వివరిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా రాంక్యా తండా రైతు వేదికలో మంగళవారం రైతు శిక్షణా కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల పాల్గొని మాట్లాడుతూ...ఈ సంవత్సరం భారత ప్రభుత్వ ఆహార సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ యాసంగిలో పండే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయటం లేదనీ వారన్నారని, కనుక ఈ యాసంగి వరి పంట కొరకు కొనుగోలు కేంద్రాలు ఉండవని, వరికి బదులుగా ప్రత్యామ్నాయంగా పెసర, మినుము ప్రొద్దుతిరుగుడు నువ్వులు ఆవాలు, కూరగాయలు సాగు చేసి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని వారు తెలిపారు. కార్యక్రమంలో జెడిఏ ఆఫీస్ ఏడిఏ, సరితా, ఖమ్మం డివిజన్ ఎడిఎ శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి భాస్కర్రావు, వ్యవసాయ విస్తరణ అధికారి వేదవ్యాస్ గ్రామ రైతులు పాల్గొన్నారు.