Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మండలం సిద్దారం గ్రామ సీపీఐ(ఎం) శాఖా సభ్యురాలు రాయిని కనకమ్మ మృతి ఎర్రజెండా ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాస్ అన్నారు. సోమవారం అర్ధరాత్రి కనకమ్మ(55) గుండెపోటుతో మృతిచెందగా మంగళవారం ఉదయం శ్రీనివాస్ ఆమె భౌతికకాయాన్ని సందర్శించారు. ఆమె పార్ధివదేహంపై పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంతాపసభలో ఆయన మాట్లాడుతూ గత 20 ఏండ్లుగా పార్టీ అభ్యున్నతికి కనకమ్మ ఎనలేని కృషి చేసిందని కొనియాడారు. స్థానిక ప్రజా సమస్యల పరిష్కార పోరాటంలో కీలక భూమిక పోషించిందన్నారు. ఆమె పాల్గొన్న ఇండ్ల స్థలాల సమస్యలు, భూమిపోరాటాల ఉద్యమాలు ఇందుకు నిదర్శనమన్నారు. కనకమ్మ ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కోరారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు ఎలగం కృష్ణ, ఎలగం రాములు, వార్డు మెంబర్ రేసు లకీë, నాయకులు తోటకూర లక్ష్మణరావు, మారుతి నారాయణ పాల్గొన్నారు.