Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ వీపీ.గౌతమ్ మంగళవారం విస్తృతంగా పర్యటిం చారు. కారేపల్లిలోని పీహెచ్సీ, వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారి ఆక్రమణలపై గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. ఆర్అండ్బీ మార్కింగ్ పెట్టినా ఆక్రమణలపై చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు తెల్పటంతో ఆర్Êబీ, పంచాయతీ అధికారులను పిలిచి దానిపై రిపోర్టు పంపించాలని ఆదేశించారు. భాగ్యనగర్‌తండా వెళ్లుతుండగా గుట్టకిందిగుంపు ఉపసర్పంచ్ ఉషాగౌస్పాషా ఆధ్వర్యంలో ప్రజలు గాజులతండా వద్ద స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇల్లందు నుండి డోర్నకల్ వరకు రహదారి పనులు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నట్లు, రహదారి గుంతలు పడి ప్రమాదాలు జరుగుతు న్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకవచ్చారు. భాగ్యనగర్‌తండా ఇరువైపు మొక్కలు వేయాలని సర్పంచ్ ఇస్లావత్ సుజాత, కార్యదర్శి సురేష్‌లకు సూచించారు. భాగ్యనగర్‌లో ఏర్పాటు చేసిన వరి ప్రత్నామాయ పంటలపై అవగాహన సదస్సుకు రైతులు తక్కువ సంఖ్యలో హాజరుకావటంపై కలెక్టర్ ఏఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఏడీఏను ఆదేశించారు. భాగ్యనగర్‌తండాలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. చేసిన పనులు దాచి పెట్టవద్దు వాటిని వినియోగంలోకి తెస్తే ఉపయోగం ఉంటుందన్నారు. పల్లె ప్రకృతి వనంను ప్రజలు ఆస్వాదించేలా చర్యలు తీసుకోవాలని, పార్క్‌లో ఫారెన్ మొక్కలే కాకుండా స్ధానిక రకాల మొక్కలు కూడా నాటాలని సర్పంచ్‌కు సూచించారు. నర్సరీలో అన్ని రకాల మొక్కలు నాటాలన్నారు. భాగ్యనగర్ నుండి కారేపల్లి వస్తున్న క్రమంలో అప్పాయిగూడెం వద్ద ఆర్Êబీ రహదారికి ఇరువైపుల మొక్కలు లేకపోవటం, ముండ్ల పొదలు ఉండటంపై ఎంపీడీవో కే.జమలారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పాయిగూడెం కార్యదర్శి, సర్పంచ్‌లకు షోకాజ్ నోటీస్‌లు జారీ చేయాలని ఆదేశించారు.
యాసంగిలో వరి వద్దు : కలెక్టర్
యాసంగిలో వరి వేయవద్దని రైతులను కోరారు. పేరుపల్లిలో జరిగిన వరి ప్రత్యామ్నాయ పంటల అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు చెప్పిన పంటలను వేసుకోవాలని కోరారు. భూ సమస్యలు, కళ్యాణలక్ష్మి సమస్యలపైగ్రామస్తులను అడిగారు. కళ్యాణలక్ష్మి పెండింగ్ ఉండవద్దనే త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్ధార్ కోట రవికుమార్‌ను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని డిసెంబర్లో పూర్తి చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి, భాగ్యనగర్, పేరుపల్లి సర్పంచ్‌లు ఆదెర్ల స్రవంతి, ఇస్లావత్ సుజాత బన్సీలాల్, అజ్మీర నాగేశ్వరరావు, డీఎంహెచ్‌వో మాలతి, ఏడీఏలు సరిత, బాబురావు, స్పెషల్ ఆఫీసర్ అజరుకుమార్, ఏవో కే.ఉమా మహేశ్వర్‌రెడ్డి వైద్యాధికారి డాక్టర్ వై.హన్మంతరావు, చందన, ఆర్ఐ సక్రు, ఎంపీవో రాజారావు, ఏపీవో రంగనాయకమ్మ తదితరులు పాల్గొన్నారు.