Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
బూర్గంపాడు మండలంలోని సారపాక లోగల ఐటీసీ పీఎసీపీడీలో గతంలో మరణించిన కాంట్రాక్టు కార్మికులు, రిటైర్డ్ అయిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గురువారం చెక్కులను టీఎన్టీయూసీ అధ్యక్షులు కనకమేడల హరిప్రసాద్ పంపిణీ చేశారు. అదేవిధంగా రిటైర్డ్ అయిన కాంట్రాక్టు కార్మికులకు గతంలో ఉన్న రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు పెంచుతూ చెక్కులను అందజేశారు. ఈ సమావేశంలో మరణించిన కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు 4 గంటల వేతనాన్ని కట్చేసి రూ.3.5లక్షలు అంద జేయగా టీఎన్టీయూసీ దానిని రూ.4లక్షలకు పెంచి అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గల్లా నాగభూషయ్య, ప్రధాన కార్యదర్శి గాదె రామకోటిరెడ్డి, జీవన్ రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఈశ్వర్రెడ్డి, హెస్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మరడాన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.