Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
విహార యాత్రల పేరుతో గోవా వెళ్లిన స్థానిక ప్రజా ప్రతినిధులను ఆసుపత్రులలోని క్వారంటైన్లో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ మండల అధ్యక్షులు కొమరం దామోదర్‌రావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అదేవిదంగా మండలంలో అనేక సమస్యలు ఉన్నాయని సీతమ్మ సాగర్ భూనిర్వాసితుల గోడు పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సమస్యలు వర్ణనాతీంగా ఉన్నాయన్నారు. ఎల్.ఎల్ రహదారి దుస్థితిపై నవతెలంగాణతో పాటు పలు పత్రికలు అనేక కధనాలు రాసినా అధికారులకు చీమ కుట్టినట్లుగా లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.