Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి కార్మికుల 3 రోజుల సమ్మెకు సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్ తెలిపారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో , కోయగూడెం ఓపెన్ కాస్ట్ లో జరిగిన సభలలో ఆయన మాట్లాడారు. సమ్మెలో పాల్గొంటున్న కార్మికులకు జేజేలు తెలిపారు. సమ్మెకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఈసం నరసింహారావు, కడుదుల వీరన్న, చిట్టిబాబు, శ్రీను, చంద్రశేఖర్, నాగేంద్రబాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.