Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు రాజమ్మ
నవతెలంగాణ-దుమ్ముగూడెం
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు అందజేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సరియం రాజమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఐద్వా మండల కమిటీ ఆధ్వర్యంలో ములకపాడు గ్రామంలో జరిగిన గ్రామ జనరల్ బాడీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని దీని వలన నిత్యవసర సరుకుల ధరలు రోజు రోజుకు విపరీతంగా పెరిగి పోతున్నాయన్నారు. కార్యక్రమంలో డింగి విజయ, జీరి సరిత, ప్రమీల, అచ్చమ్మ, సవిత, ప్రశాంతి, బేబీ, జ్యోతి, నాగమ్మ, అలివేలు తదితరులు పాల్గొన్నారు.