Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్
నవతెలంగాణ-పాల్వంచ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న విద్యుత్ సవరణ చట్ట బిల్లును అలాగే విద్యుత్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ ప్రభుత్వన్నీ డిమాండ్ చేశారు. గురువారం పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన పట్టణ బీఎస్పీ కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో కామేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తోందని అందులో భాగంగా 2021 విద్యుత్ సవరణ చట్టం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, అసెంబ్లీ అధ్యక్షుడు ముదిగొండ జయంత్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు జెట్టి ఆనందరావు, నండ్రి శంకర్, అజరు తదితరులు పాల్గొన్నారు.