Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టోర్నమెంట్ ప్రారంభించిన డీఎస్పీ
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి, గుండాల, టేకులపల్లి మూడు మండలాల స్థాయిలో మూడు రోజుల పాటు నిర్వహించబడే మెగా వాలీబాల్ టోర్నమెంట్ను ఇల్లందు డీఎస్పీ రవీందర్ రెడ్డి మండల కేంద్రంలో గురువారం ఘనంగా ప్రారంభించి, మాట్లాడారు. మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా క్రీడా మైదానంలో జరుగుతున్న ఈ క్రీడలకు టేకులపల్లి సీఐ బి.రాజు, స్థానిక ఠాణా ఎస్సై పి.సంతోష్ల ఆధ్వర్యంలో జరగటం హర్షణీయమన్నారు. ఈ క్రీడల వల్ల యువకులకు ఎంతో శరీర ధృఢత్వాన్ని పెంపొందిస్తా యని, స్నేహభావం ఏర్పడుతుందని అన్నారు. మూడు మండలాల క్రీడాకారుల నడుమ సత్సంబంధాలు నెలకొంటాయన్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. సుమారు పదేళ్ల నుండి మర్కోడు గ్రామ పంచాయతీలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉన్న ప్పటికీ సిగల్ సమస్యలతో ప్రజలు ఎంతో సతమ తమవుతున్నారన్న సమస్య గుర్తించి, జియో నెట్వర్క్ సేవలు అందించేందుకు డీఎస్పీ రవీందర్ రెడ్డి కృషి చేసి జియో యాజమాన్యంతో మాట్లాడడం జరిగిం దన్నారు. దీంతో పాటు అటవీశాఖ అనుమతులు సైతం ఇవ్వడం జరిగిందన్నారు. అతి త్వరలో పనులు ప్రారంభించేందుకు జియో యజమానులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యాపార వర్గాలు గౌరిశెట్టి శ్రీనివాసరావు, అబ్బు నాగేశ్వరరావు, అనుమోల వెంకటేశ్వర్ రావు, బూరుగడ్డ రాములు, సర్పంచ్లు మెస్సు కోటేశ్వరరావు, కొమరం శంకర్ బాబు, పూనెం నిర్మల, తదితరులు పాల్గొన్నారు.