Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ 524 కేజీలు స్వాదీనం...
విలువ రూ.1కోటి4లక్షల 88 వేలు
అ డీఎస్పీ జి.వెంకటేశ్వరబాబు వెల్లడి
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారని, చింత పండు బస్తాల కింద అక్రమంగా తరలిస్తున్న 524కేజీల గంజాయిని పట్టుకున్నారని దీని విలువ సుమారు రూ.1కోటి 4లక్షల 88 వేలు ఉంటుందని కొత్తగూడెం డిఎస్పీ జి.వెంకటేశ్వర బాబు తెలిపారు. బుధవారం చుంచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు తెలిపారు. చుంచుపల్లి పోలీసులు ఉదయం వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆర్జే-06, జిఏ-3950 నెంబర్ గల లారీ అనుమానస్పదంగా కనిపించందని తెలిపారు. దాన్ని తనిఖీ చేయగా లారీలో 20 ప్లాస్టిక్ బస్తాల్లో 524.400 గ్రాముల నిషేదిత గంజాయిని చింత పండు బస్తాల కింద దాచిపెట్టి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. రాజస్తాన్‌కు చెందిన లారీ డ్రైవర్ నారాయణ, బైరు లాల్‌లను పోలీసులు విచారించారని తెలిపారు. గతంలో వీరు కొద్ది కొద్దిగా గంజాయి అక్రమంగా తరలించే వారని తెలిపారు. ఓరిస్సా ప్రాంతంలోని చిత్ర కొండ ప్రాంతం నుండి గుర్తు తెలియని వ్యక్తుల ఉండి గంజాయిని సేకరించి, చింత పండు బస్తాల కింద అమర్చి రాజస్తాన్‌కు తరలిస్తున్నారని తెలిపారు. చాకచక్యంగా గంజాయిని పెద్దఎత్తున పట్టుకున్న ఎస్.మహేష్‌ను డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. కేసు నమోదుచేసినట్లు తెలిపారు. ఈ విలేకర్ల సమావేశంలోఎస్ఐ బి.మహేష్, నాగరాజు, సిబ్బంది సురేష్, రాంబాబు, సుషీ, హిమ్లా తదితరులు పాల్గొన్నారు.