Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వాడకుండానే శిధిలావస్థకు
అ అలంకార ప్రాయంగా నివాస సముదాయం
నవతెలంగాణ-అశ్వారావుపేట
కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ప్రభుత్వ భవనాలు చిన్నపాటి సౌకర్యాలు లేకపోవడంతో వాడకుండానే శిధిలావస్థకు చేరి అలంకార ప్రాయంగా ఉంటాయనడానికి ఈ చిత్రంలో కనిపిస్తున్న భవనమే మంచి ఉదాహరణ.
మండల పరిధిలోని సున్నంబట్టిలో గల గిరిజనాభివృద్ధి శాఖ గురుకుల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల నివాసం కోసం 2013లో రూ.30 లక్షల బీఎస్సీ(టీఎస్పీ) నిధులతో ఉపాధ్యాయుల నివాసం భవన సముదాయం నిర్మించి ప్రారంభించారు. కానీ ఆ సముదాయానికి అవసరం అయిన నీటి వసతి కోసం బోర్ బావి లేక పోవడంతో అందులో సిబ్బంది నివాసానికి యోగ్యం కాకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అంతే అవి ఎవరికీ ఉపయోగపడకుండానే శిధిలావస్థకు చేరడంతో ఆ శాఖాధికారు వైఫల్యం ప్రజాధనం దుర్వినియోగానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా నీటి వసతి కల్పించి చిన్నపాటి మరమ్మతులు చేయిస్తే ఉపాధ్యాయులు వినియోగించుకునే అవకాశం ఉంది. అలా కాకపోతే నిర్మాణ వ్యయం వృధానే అని పలువురు ప్రజాస్వామిక వాదులు అభిప్రాయపడుతున్నారు.