Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సొసైటీ చైర్మన్ బిక్కసాని
నవతెలంగాణ-భద్రాచలం(బూర్గంపాడు)
సొసైటీ ఆధ్వర్యంలో బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బూర్గంపాడు సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను పెంచుతామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల సంఖ్యను పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల ఇబ్బందులను అడిగి సమస్య పరిష్కరానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు కొంతమేరకు ఆందోళన చెందుతున్నారని, అయినప్పటికీ కేంద్రాల వద్ద వారికి ఎలాంటి ఇబ్బందులు జరగనివ్వమన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తేమశాతం 17శాతం మించకుండా చూసుకోవాలని, ధాన్యం నాణ్యత వచ్చాకే మిల్లులకు తరలించాలన్నారు. తొలుత కేంద్రంలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.