Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎం.సాయిబాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు చట్టం ద్వారా సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకులు ప్రయివేట్ పరం చేయడానికి పూనుకుంది. ఈనెల 13న వేల వేయనుంది. దీన్ని కార్మికులు ప్రత్యక్షంగా అడ్డు కుంటున్నారు. లేని పక్షంలో కార్మికులకు మనుగడ ఉండదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం. సాయిబాబు హెచ్చరించారు. విద్యురంగ, వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం జరుగుతున్న సమ్మె. సింగరేణి ఉత్పత్తి చేసే బొగ్గు సిమెంటు, స్టీల్, ఎరువులు, విద్యుత్ పరిశ్రమలు వినియోగిస్తున్నాయి. ప్రయివేటు చేస్తే సిమెంటు, విద్యుత్, ఎరువులు అందుబాటులో ఉండవని, వ్యవసాయం, విద్యుత్ ప్రయివేటు శక్తుల్లోకి వెలుతుందని తెలిపారు. కావున బొగ్గు బ్లాకుల పరిరక్షణకు అన్ని కార్మిక సంఘాలు కలిసి రావడం శుభసూచకం అన్నారు. నిజమైన దేశ భక్తితో కార్మిక సంఘాలు సమ్మెలకు ముందుకు వచ్చాయన్నారు. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి దేశ భక్తిలేదని సమ్మె చేస్తున్న కార్మిక వర్గంలో దేశ భక్తి ఉందని స్పష్టం చేశారు. సింగరేణిలో జేబిసీసీఐ ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 9 ఏండ్లుగా కార్మికులకు జేబిసీసీఐ ఒప్పంద వేతనాలు ఇవ్వడంలేదని, 9 ఏండ్ల కాలంలో కాంట్రాక్టు కార్మికులు రూ.18 వేల కోట్లు నష్టపోయారని తెలిపారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడం నిరసిస్తూ, కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కరోన, మైన్ ప్రమాదాల్లో మర ణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటు ంబాలకు రూ.15 లక్షల నష్టపరి హారం చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నుండి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రగాని కృష్ణయ్య, ఎం.వి. అప్పారావు, ఎం.చంద్రశేఖర్, జి.శ్యామ్ కుమార్, ఏ.ప్రభాకర్, సుభద్ర, మన్సర్, విజరు కృష్ణ, ఏఐటియూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సత్యనారా యణ, వంగా వెంకట్, పిట్టల రామచందర్, వీరస్వామి ఐఎఫ్టియు నుండి డి.ప్రసాద్, యన్. సంజీవ్ కుమార్, పి.సతీష్, నాగలక్ష్మి, బిఎంఎస్ నుండి నాగేంద్రబాబు, జి.రఘు, ఐ.నాగేష్, డి. నిర్మల ఐఎన్టియూసీ నుండి నాగభూషణం, హెచ్ఎంఎస్ నుండి బివి.రమణ రావు తదితరులు పాల్గొన్నారు.