Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రీజినల్ మేనేజర్ శ్రీకాంత్
నవతెలంగాణ-చండ్రుగొండ
భీమ చేసి ప్రతి ఒక్కరూ ధీమాగా ఉండాలని భీమా చేయడం వల్ల మీ కుటుంబం వీధిన పడకుండా ఉంటుందని రీజినల్ మేనేజర్ శ్రీకాంత్ ఖాతాదారులకు సూచించారు. గురువారం స్థానిక ఏపీజీవీబీ బ్యాంకులో ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో కొట్టుకెళ్ళి మృతి చెందిన చెన్నబోయిన నారాయణ ఆ కుటుంబానికి రూ.20లక్షల చెక్కును శ్రీకాంత్ అందజేశారు.కార్యక్రమంలో అడ్వాన్స్ మేనేజర్ బాలాజీ, అడ్మిన్ శ్రీనివాసరావు, ఎఫ్ఐసీ రవికుమార్, ఎస్బిఐ నరేందర్ రెడ్డి, ఏపీజీవీబీ మేనేజర్ జి.సునీల్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ త్రినాథ్, బ్యాంక్ మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.