Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
స్ధానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల సెంటర్ నందు గల శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య శ్వర ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్మ్రణ్యస్వామి వారి కళ్యాణం ఘనంగా నిర్వహిం చారు. గురువారం ఉదయం 5-30గంటల నుండి స్వామివారికి ఆలయ అర్చకులు బైరవ బొట్ల వెంకటరత్నంచే రుద్రాభిషేకం అష్టోత్తర నామార్చనలు నిర్వహించారు అనంతరం నాగ దేవతకు మహిళలచే కుంకుమ పూజ నిర్వహించి, అమ్మవారి పసుపు, కుంకుమ, గాజులను పూజలో పాల్గొన్న భక్తులకు పూజారి అందించినారు. సాయంత్రం 5-30 గంటలకు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ కార్యక్రమంను అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.