Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్‌కు అభివృద్ధి రూట్ మ్యాప్ అందజేసిన సర్పంచ్
నవతెలంగాణ-దుమ్ముగూడెం
చారిత్రక ప్రదేశమైన పర్ణశాల గ్రామ పంచాయతీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని పర్ణశాల గ్రామ పంచాయతీ సర్పంచ్ తెల్లం వరలకీë కలెక్టర్ అనుదీప్‌ను కోరారు. ఈ నెల 7వ తేదీన కలెక్టరేట్లో పంచాయతీ అభివృద్ధి రూట్ మ్యాప్‌ను ఆయనకు అందజేయడంతో పంచాయతీలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఆమె తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే బోట్ షికారు, వాహన పార్కింగ్ వేలం పాటలు ఆగి పోవడం పంచాయతీ అభివృద్ధికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే వేలం పాటలు నిర్వహించేలా సంబందిత అధికారుల దృష్టికి తీసుకు పోవడంతో పాటు వేలం పాటలను సైతం పాత పద్ధతిలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. దీంతో సానుకూలంగా స్పందించిన కలెక్టర్ పర్ణశాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించే వేలం పాటలు తక్షణమే నిర్వహించాలని సంబందిత డీపీఓను ఆయన ఆదేశించారు. దీంతో పాటు పర్ణశాల అభవృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించే విదంగా తగు చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు సర్పంచ్ తెల్లం వరలకీë నవతెలంగాణకు తెలిపారు.