Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
టీఎస్ యూటీఎఫ్ భద్రాచలం ప్రాంతీయ కార్యాలయంలో చెన్నుపాటి లక్ష్మయ్య 53వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెన్నుపాటి లక్ష్మయ్యకి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు పాల్గొని నివాళులు అర్పించారు. టీఎస్ యుటిఎఫ్ భద్రాచలం ప్రాంతీయ కార్యాలయం కన్వీనర్ లక్ష్మీ నారాయణ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఏమి, కామ్రేడ్ స్వర్ణ జ్యోతి పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లా కార్యదర్శి డి.థావురియా, మండల నాయకులు భద్రాచలం మండలం అధ్యక్ష, కార్యదర్శులు జె.శ్రీను, ఎస్.విజరు కుమార్, ఉపాధ్యక్షులు కామ్రేడ్ రమేష్ చంద్ అదేవిధంగా భద్రాచలం మండల ఆడిటర్ సిహెచ్ శ్రీనివాసరావు, కాంప్లెక్స్ కార్యదర్శి పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.