Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, తన సతీమణి మధులిక, మరో 11 మంది మృతి చెందడం భారతదేశానికి తీరనిలోటని మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. తొలుత బిపిన్ రావత్ చిత్రపటం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన ప్రతిఒక్కరి త్యాగం మరువలేనిదన్నారు. సంతాపం తెలిపిన వారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ సావీర్ హుస్సేన్ సాన్ సెల్ అధ్యక్షుడు బి. సురేష్, జిల్లా కాంగ్రెస్ నాయకులు హల్ నాయక్, మండల నాయకులు చేతి రాములు, కిషన్, వేణు, మాజీ సర్పంచ్ దుక్మిణి, మైనార్డ్ సెల్ అధ్యక్షుడు హబీజ్ మండల నాయకులు రాజు బాబా తదితరులు ఉన్నారు.
భద్రాచలం : త్రివిధ దళాల ముఖ్య అధికారి రావత్, 13 మంది జవాన్లు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో మౌనం పాటించి నివాళులు అర్పించారు. గురువారం భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూదేశ చరిత్రలోనే అతి పెద్ద ఘటనగా ఈ ప్రమాదాన్ని భావించవచ్చని ఆయన అన్నారు. అదేవిధంగా ఏఐ సీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశానుసారం క్యాంపు కార్యాలయంలో, పట్టణ, మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో డిజిటల్ ఓటర్ గుర్తించి ఎన్రోల్మెంట్ నమోదు కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్, అధ్యక్షులు రవికుమార్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర నరసింహారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నరేష్, సతీష్, మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు రంగారావు, బీసీ సెల్ అధ్యక్షులు మాజీ, హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సుధీర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి కొండల్లో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, వారి సతీమణి మధులిక వారి సహచర ఆర్మీ అధికారుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఇల్లందు జగదంబ సెంటర్లో గల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరా భవన్లో ఇల్లందు నియోజక వర్గ నాయకులు టీపీసీసీ సభ్యులు చీమల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సంతాప సభలో చీమల వెంకటేశ్వర్లు, నియోజక వర్గ నాయకులు దల్ సింగ్ మాట్లాడారు. సంతాప సభలో ఏ బ్లాక్ అధ్యక్షుడు జలీల్, బీ బ్లాక్ అధ్యక్షుడు టీ.సామ్రాజ్, పట్టణ అధ్యక్షులు డానియిల్, మండల అధ్యక్షులు పులి సైదులు, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ కోరి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎట్టి హరికృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి అరెం కిరణ్, పట్టణ ప్రధాన కార్యదర్శి జాఫర్, మండల మైనారిటీ సెల్ ఫకృద్దున్ తదితరులు పాల్గొన్నారు.
పినపాక : పినపాక ప్రెస్ ఆధ్వర్యంలో బిపిన్ రావత్‌కు ఘన నివాళులు తెలియజేశారు. కొవ్వొత్తుల ర్యాలీ బయ్యారం క్రాస్ రోడ్ నుండి ఉప్పక బ్రిడ్జ్ వరకు నిర్వహించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ బయ్యారం నాలుగు రోడ్ల కూడలిలో మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మ లింగారెడ్డి, ఉపాధ్యక్షులు బోడ లక్ష్మణ్ రావ్, ప్రధాన కార్యదర్శి సంతోష్, సభ్యులు శ్రీరామ్ బృహస్పతి, దొడ్డి శ్రీనివాస్ రావ్, లక్ష్మయ్య, కొంపెల్లి నాగేశ్వరావు, కన్నె రమేష్, దొడ్డ శ్రీను, గోడిశాల చంద్రం, విజరు, నిట్ట వెంకటేశ్వర్లు, విజరు, నర్సింహ మూర్తి, శ్రీలత, సంపత్, తెరాస ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు తిరుపతి, శంకర్, యోగి, నవీన్, ప్రభాకర్‌లు పాల్గొన్నారు.
మణుగూరు దేశ సరిహాద్దులో సైన్యం లేకుంటే దేశానికి భధ్రత లేదని రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. గురువారం చరవాణీ ద్వారా విలేకరులతో మాట్లాడుతూ భారత త్రివిధ దళాధిపతి బిపిన్‌సింగ్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందారన్నారు. ఆయన అకాలమరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గొప్ప సేనాధిపతి బిపిన్ సింగ్ రావత్ అని ఆయన అభివర్ణించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటిస్తూ తమ కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.