Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ రసవత్తరంగా కొనసాగుతోంది. అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీకి ఎంపీటీసీలు అత్యధిక స్థానాలు ఉన్నా ఆ పార్టీ నేతల్లో ఎమ్మెల్సీ గెలుపుపై గుబులు రేపుతోంది. అధికార పార్టీ నుండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ఆర్ఐ తాత మధును టీఆర్ఎస్ పార్టీ పోటీలో నిలిపింది. శుక్రవారం జరగనున్న ఎన్నికల పోలింగులో వీరి భవితవ్యం బయటపడనుంది. మధు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి జరిగిన ఉద్యమంలో ఆయన పాత్ర ఎక్కడ లేదనేది నిర్వివాదాంశం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసినవారి కుటుంబసభ్యులకు స్థానం కల్పించుకోవడం. కనీసం గుర్తింపు కూడా లేదని ఆ పార్టీలో అధికారం, పదవులు అనుభవించేది ఎవరు, అమరవీరుల త్యాగాలకు విలువ ఎక్కడ అని... ఆపార్టీలోనే ఉన్న కిందిస్థాయి క్యాడర్, కష్టపడి పనిచేసిన నాయకుల్లో అసంతృప్తి, కట్టలు తెంచుకొని నిరాశ నిస్పృహల్లో కొట్టుమిటా ్టడుతున్నారు. ఆవేదన, ఆక్రందన మధ్య నలుగుతున్న పార్టీ కార్యకర్తలను పట్టించుకునే వాడే లేడుని విమర్శలు వినబడతున్నాయి. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన ప్రజాప్రతినిధులు అంతరంగాలలో వ్యతిరేకత ప్రారంభమైందని కనిపిస్తుంది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మధ్య పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నుండి పోటీ చేస్తున్న తాతా మధు, పట్ల పలువురు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న రాయల నాగేశ్వరరావు తాత మధుకు సమఉజ్జీగా అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండి ఆరితేరి గుర్తింపు పొందిన వ్యక్తి. గ్రానైట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేస్తున్న రాయల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనదైన శైలిలో రాజకీయంగా పట్టున్న నేత. హార్దిక ఆర్థికఅంగబలంతోపాటు రాజకీయాలలో అందవేసిన చేయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రాయల పోటీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆయన పోటీ అధికార పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తోంది. రాయల నాగేశ్వరరావు కుటుంబ నేపథ్యం రాజకీయాల్లో చక్రంతిప్పిన ఆయన తండ్రి రాయల వెంకటేశ్వర్లు సిపిఐ(ఎం)లో 40 సంవత్సరాలుగా పార్టీలో చురుకుగా పనిచేసి అపరచాణక్యుడిగా పేరుపొంది పార్టీ అభివృద్ధికి బాటలు వేశారు. అనివార్య కారణాల వల్ల ఒక పదిసంవత్సరాలు పార్టీకి దూరమై కాంగ్రెస్లో కొనసాగి తిరిగి మాతృసంస్థ అయిన సిపిఎంలో ఇటీవల కాలంలో రాయల వెంకటేశ్వర్లు చేరారు. రాయల వెంకటేశ్వర్లు రాజకీయ ఉద్దండుడు. తండ్రికి తగ్గ తనయుడుగా రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీలో చాపకిందనీరులా రాజకీయాలలో ఎదిగాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎంపీటీసీల బలం తక్కువగా ఉన్నప్పటికీ పోటీ చేయడానికి ధైర్యం చేసి రాయల సాహసం చేయటం గమనార్హం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీటీసీల నుండి మంచి రాయలకు బలమైన సంబంధాలు కలిగి ఉన్నాయి. రాయల నాగేశ్వరావు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందినవారు. రాయల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలుపొందేటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని, దీనికితోడు గ్రౌండ్ వర్క్ సజావుగా సాగిందని తెలిసింది. గెలుపుబాటలో గెలుపు దిశగా రాయల నాగేశ్వరరావు పయనించడం విశేషం. రాయల నాగేశ్వరావు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలవటం ఖాయమని సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో దీటైన పోటీలో రాయల నిలిచారని జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.