Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
కడు నిరుపేదరికం, పైగా తల్లిదండ్రులు చదువులేని నిస్సహాయులు, చదివే స్తోమత లేదు, మిక్కిలి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ తనలోని ప్రతిభను ఆపలేవు అని గ్రామీణ విద్యార్థి హర్షవర్ధన్ నిరూపించారు. వివరాల్లోకి వెళితే... బొమ్మకంటి హరవర్ధన్, ఎక్సలెంట్ భాషా హై స్కూల్ ఈ బయ్యారంలో 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు 2014 నుంచి 2021 వరకు విద్యాభ్యాసం చేశాడు. మారుమూల ప్రాంతమైన దమ్మక్కపేట గ్రామంకు చెందిన బొమ్మకంటి రమేశ్, అనితల కుమారుడు హర్షవర్ధన్ అంతర్జాతీయ ఖేల్ కబడ్డీ లీగ్‌కు అర్హత సాధించి ఔరా అనిపించాడు. కనీస సౌకర్యాలు లేకుండానే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో నేనేమి తక్కువ కాదని సమస్యలకే సవాల్ విసిరాడు. గోవాలో రాష్ట్ర స్థాయి ఖేల్ కబడ్డీ క్రీడలు నవంబర్ 27న జరిగిన క్రీడల్లో సత్తా చాటి, అంతర్జాతీయ క్రీడలకు ఎంపిక అయ్యాడు. నేపాల్‌లో ఈ నెల 17 నుంచి 20 వరకు జరగనున్న ఖేల్ కబడ్డీ క్రీడల్లో పాల్గొననున్నారు. అంతర్జాతీయ ఖేల్ కబడ్డీ లీగ్‌కు ఎంపిక అయినందున ఎక్స్ లెంట్ పాఠశాల కరస్పాండెంట్, యూసఫ్ షరీఫ్ , డైరెక్టర్స్ ఖాదర్, యాకూబ్ షరీఫ్, నర్సారెడ్డి, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ సురేష్ ఉపాధ్యాయులు అభినందించారు.