Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
మండలంలోని సాయి ఎక్సెలెంట్ స్కూల్ 23వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోడ్డు, భవనాలు కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, సాయి ఎక్సెలేంట్ స్కూల్ వ్యవస్థాపకులు గొల్లమందల రమేష్, సాయి ఎక్సెలెంట్ స్కూల్ కరస్పాండెంట్ ఆరెబోయిన కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కరోనా కారణంగా స్కూల్ వార్షికోత్సవం స్కూల్ విద్యార్థులు లేకుండా జరుపుకోవడం చాలా బాధాకరమన్నారు. అయినప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూల్ చుట్టుపక్కల తక్కువ మంది విద్యార్థులతో జరుపుకోవడం జరిగిందన్నారు. గత నాలుగు సవత్సరాల నుండి నవోదయ, గురుకులం పాఠశాల ప్రవేశ పరీక్షలో సాయి ఎక్సలెంట్ స్కూల్లో కోచింగ్ పొందిన విద్యార్థులకు ఎక్కువ సీట్లు రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. కేవలం పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నవోదయ, గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సీట్ వచ్చే విధంగా కోచింగ్ ఇవ్వడంతో పాటు గురుకుల, నవోదయ పాఠశాలలో తరగతి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన, ఉన్నతమైన కోచింగ్‌ను విద్యార్థులకు అందచేసి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో, జవహర్ నవోదయ పాఠశాల సీట్ సాధించే విధంగా తీర్చిదిద్ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులను పంపేందుకు కృషి చేస్తున్నామన్నారు. అదేవిధంగా రమేష్ మాట్లాడుతూ సాయి ఎక్సలెంట్ స్కూల్ వార్షకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో సంతోష కరమన్నారు. సాయి ఎక్సలెంట్ స్కూల్‌ను చిన్న టిటోరియల్గా స్థాపించి ఈ రోజు సుమారుగా 400 మంది విద్యార్థులు సాయి ఎక్సలెంట్ స్కూల్లో చదవడం ఎంతో సంతషకరమన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని విద్యార్థులు, నవోదయ, గురుకుల పాఠశాలలో ప్రతి సంవత్సరం జరిగే పోటీ పరీక్షల్లో ఎక్కువ సీట్లు సాధించాలన్నారు. అదేవిధంగా చిలుకూరు రమేష్, పెండ్యాల జగన్నాధం మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి విద్యను అభ్యసించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి రమేష్, పెండ్యాల జగన్నాధం, రాంబాబు, సిద్దిక్ ఉపాధ్యాయులు సరిత, ప్రసాద్, అనూష, నాబీనా, సరిత, అనిత, జమున, రమ్య, అశోక్, శాంతమ్మ, విద్యార్థుల తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.