Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
పోరాటాలతోనే హక్కులను సాధించుకోవచ్చని ప్రముఖ రచయిత ఎండీ ఉస్మాన్ ఖాన్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో మానవహక్కుల దినోత్సవం సందర్భంగా మానవ హక్కులు అనే అంశంపై అవగాహన కల్పించారు. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నేడు ప్రజలు హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి చూస్తున్నామని, కూడు, గూడు, గుడ్డ వంటి మౌలిక అవసరాలతో పాటు ప్రధానంగా జీవించే హక్కు ప్రభావితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదిహేను నెలలుగా తమ హక్కుల కోసం పోరాడిన రైతాంగాన్ని అణగదొక్కాలని, అందులో భాగంగా 750 మంది రైతులు చావుకు కారణమైన కేంద్ర ప్రభుత్వం మానవహక్కుల హసనానికి పాల్పడిందని విమర్శించారు. హక్కుల పరిరక్షణకు పోరాటాలే మార్గాలుగా కనబడుతున్నాయన్నారు. ఈ సమావేశంలో మండల కోఆప్షన్ సభ్యులు జబ్బార్, బాజీ, జాని, సుభానీ తదితరులు పాల్గొన్నారు.