Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కెరీర్ గైడెన్స్ అవగాహనా
సదస్సులో నర్సింహారెడ్డి
నవతెలంగాణ-పాల్వంచ
విద్యార్ధులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడితే విజయాలు మీ తలుపుతడతాయని ఇండియన్ రెవెన్యు సర్విసెస్ అధికారి సాధు నర్సింహారెడ్డి వెల్లడించారు. శుక్రవారం పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సివిల్ సర్వీసెస్ పరీక్షలపై కెరీర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహనా సదస్సును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్నన్నయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్యస్ అధికారి నర్సింహారెడ్డీ ప్రధాన వక్తగా హాజరై మాట్లాడుతూ ప్రపంచంలో పది ప్రధాన అతి కష్టమైన పరీక్షలల్లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఒకటన్నారు. దీనిని సాధించుటలో విద్యార్ధులు భయపడవద్దని సూచించారు. భారతదేశంలో మాత్రు భాషలు అడ్డంకి కాదని, మానసిక, శారీరిక, అంగవైకల్యం, పేదరికం అడ్డుకాదని సివిల్ సర్వీసెస్ సాధించిన అధికారుల జీవిత చరిత్రలను ఉదాహరణలతో సహా పీపీటీ, వీడియో రూపంలో వివరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తీగా గిరిజన జిల్లా అయినందున ప్రభుత్వ కళాశాలలో విధ్యనభ్యసిస్తున్న విద్యార్ధులకు సివిల్ సర్వీసెస్ పై అపోహలు, అనుమానాలను నివృత్తి చేయుటకు తరుచూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని విలేఖర్లకు వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షులు సంగం వెంకట పుల్లయ్య, కెరీర్ గైడెన్స్ సెల్ ఇన్చార్జి సూరంపల్లి రాంబాబు, అకడమిక్ కో ఆర్డినేటర్ విజరు కుమార్, సీనియర్ అధ్యాపకులు అబ్రాహమ్, ఐక్యుఏయస్ కో ఆర్డినేటర్ పూర్ణచందర్ రావు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.