Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండలంలోని దుమ్ముగూడెం గ్రామానికి చెందిన కర్రి శ్రీనివాస సంజరు అనే విద్యార్ధి జమ్ము కాశ్మీర్‌లోని శ్రీనగర్ సెంట్రల్ నిట్‌లో సీటు సాదించాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జెఈఈ మెయిన్స్‌లో ర్యాంకు సాదించిన సంజరు శ్రీనగర్ సెంట్రల్ బిటెక్‌లో అర్హత సాదించాడు. సంజరు చిన్న నాటి నుండి చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నాడు. సంజరు పదవతరగతి పరీక్షల్లో 9.7 జిపిఏ మార్కులు సాదించగా ఇంటర్లో 9.82 జిపిఏ మార్కులతో ఉత్తీర్ణత సాదించాడు. నేషనల్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాటజీ శ్రీనగర్ సెంట్రల్ బిటెక్‌లో అర్హత సాదించిన సంజరును విద్యార్థి తల్లి దండ్రులు కర్రి శివకుమార్‌లాల్, హైమావతితో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందించడంతో పాటు విద్యలో మరిన్ని ఉన్నత శిఖరాలను అదిరోహించాలని ప్రశంసించారు.