Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తడిసిన ధాన్యం రాసులతో లబో దిబో మంటున్న రైతులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఈ ఏడాది వర్షాలు రైతులను పగబట్టినట్లుగానే ఉన్నాయి. వెంటాడుతున్న వర్షాలతో మండల రైతులు ఆగం..ఆగం అవుతున్నారు. విపత్తులతో కురుస్తున్న వర్షాలతో రైతుకు కంటిమీద కుపుకు లేకుండా చేస్తున్నాయి. చేతి కందిన పంటలు వరుణుడి పాలు అవుతున్నాయి. కల్లాలలో పోసిన ధాన్యం రాశులను కాపాడుకోవడం కోసం రైతులు ఉరుకులు..పరుగులు పెడుతున్నారు.
మండల వ్యాప్తంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరి కోత యంత్రాలలో కోసిన ధాన్నాన్ని ట్రాక్టర్ల ద్వారా తోలి కల్లాలలో ఆర బోస్తున్నారు. ప్రభుత్వం తాలు లేకుండా మేలు రకం ధాన్యంతో పాటు నిమ్ము శాతం లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించడంతో రైతులు కోత మిషన్ ద్వారా కోసిన ధాన్యాన్ని తూర్పాలా పట్టి కల్లాలలో 20 నుండి 25 రోజుల పాటు ఆరబోస్తున్నారు. వాతావరణంలో మార్పులతో ధాన్యం రాశులను రైతులు రాత్రి పగలు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. గురువారం రాత్రి నుండి కురుస్తున్న మోస్తరు భారీ వర్షానికి మండల వ్యాప్తంగా కల్లాలో పోసిన దాన్యం రాశులు పలు చోట్ల తడిసి పోయాయి. వాటిని కాపాడుకోవడం కోసం కుటుంబ సభ్యులతో కలసి జాగారాలు చేశారు.
తడిసిన ధాన్యం రాశుల పరిశీలన : మండలంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి నర్సాపురంలో తడిసిన ధాన్యం రాశులను రైతుబందు సమితి మండల అధ్యక్షులు బత్తుల శోభన్‌బాబు శుక్రవారం పరిశీలించారు. ఆకాల వర్షాలతో మండల వ్యాప్తంగా కల్లాలలో ఆరబోసిన ధాన్యం రాశులు తడవడం వలన రైతుల తీవ్రంగా నష్ట పోయారన్నారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట నర్సాపురం సర్పంచ్ వర్సా శివరామకృష్ణ, సింగవరం ఉపసర్పంచ్ బూరం మనేశ్వరావు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పూజారి సూర్యచందర్ రావు తదితరులు ఉన్నారు.