Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి
నవతెలంగాణ-కొత్తగూడెం
మహిళా చట్టాలను పకడ్బందిగా అమలు చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఐద్వా ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మహిళా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని, మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు ఖండించాలని, మద్యపాన నిషేధం అరికట్టాలని, మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించాలని, అశ్లీల చిత్రాలు నిలిపి వేయాలని ప్లకార్డులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన చేశారు. ముందుగా మంచికంటి భవన్ నుండి ర్యాలీగా బస్టాండ్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శనగా వెళ్లారు. ఈ సందర్భంగా ఐద్వా టౌన్ కార్యదర్శి ఎస్.లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు విద్యార్థులపై హింస పెరుగుతుందని దీనికి కారణం మద్యం నిషేదించ కపోవడమే అని తెలిపారు. గుడి, బడి, ఆలయాల దగ్గర మద్యం షాపులు విచ్చల విడిగా పెట్టడం వలన నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఐద్వా ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వి.వాణి, కె.సత్య, అన్నవరపు ఇందిరా, సువర్ణ, అన్నవరపు పద్మ, విక్టోరియా, రహిమా, విజయ, తులసి తదితరులు పాల్గొన్నారు.