Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూక్య వీరభద్రం, బొంతు రాంబాబు
నవతెలంగాణ-కొణిజర్ల
దేశంలో రాష్ట్రంలో ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని వెంటనే రాజకీయ డ్రామాలు మాని ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వైరా అసెంబ్లీ ఇంచార్జ్ భూక్య వీరభద్రం, బొంతు రాంబాబులు డిమాండ్ చేశారు. సిపిఎం మండల విస్తృతస్థాయి సమావేశం జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రెండు ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేయడం రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మండలంలో అన్ని గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పోడు భూముల హక్కు పత్రాలకు తీసుకున్న దరఖాస్తులపై వెంటనే భూములు సర్వే నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు అన్నవరపు వెంకటేశ్వర్లు, దొడ్డపనేని కృష్ణార్జున రావు, బోయినపల్లి శ్రీనివాసరావు, ప్రతాపనేని లక్ష్మయ్య, రోషన్ బేగ్, తేజావత్ సీతారాములు, బానోత్ హరిచంద్ర, లింగాల దానయ్య ,మంగ చెన్నారావు, తాళ్లపల్లి విజయ పాల్గొన్నారు.