Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్
నవతెలంగాణ-కారేపల్లి
కేంద్ర రాష్ట్ర పాలకులపై కోటి ఆశల పెట్టుకున్న యువతను ఆ పాలకుల చేతిలో మోసపోయారని డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు చింతల రమేష్, వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు కొండెబోయిన నాగేశ్వరరావులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం కారేపల్లిలో జరిగిన డీవైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో దారావత్ రవికుమార్ అధ్యక్షతన జరిదింది. ఈసమావేశంలో వారు మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగమని కేసీఆర్, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అంటూ మోడీలు అధికారం చేపట్టి నిరుద్యోగులను నిస్తేజంలోకి నెట్టారని విమర్శించారు. డిగ్రీ పూర్తి చేసిన యువత 28 లక్షల మంది నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తున్నా పాలకులకు పట్టటం లేదన్నారు. రాష్ట్రంలో పీఆర్సీ కమిటీ 191136 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ప్రకటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం 60 వేల ఉద్యోగాలకు నోటీఫికేషన్లఇస్తామనటం యువతను మోసం చేయటమేననన్నారు. ఉద్యోగ నోటీఫికేషన్ కోసం నిరీక్షించి యువత నిరాశ, నిస్పృహాకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఉద్యోగల కల్పన లేదు, నిరుద్యోగు భృతి లేక పోవటంతో యువత ఏమి చేయాలో పాలుపోక పెడిదోవ పట్టటం, డ్రగ్స్, మద్యంకు అలవాటు పడి జీవితాలను ఆగం చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల కార్యదర్శి కే.నరేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, డీవైఎఫ్ఐ నాయకులు బాదావత్ రవికుమార్, అంగిరేకుల సత్యనారాయణ, నాగేంద్రబాబు, ఈశ్వర్, శశి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.