Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పర్యవేక్షించిన సిపి విష్ణు ఎస్ వారియర్
నవతెలంగాణ-ఖమ్మం
ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఏ చిన్న సంఘటన జరిగిన వేంటనే ఆయా ప్రాంతాలకు చేరుకునే విధంగా రూట్ మెబైల్ పార్టీలు, స్టైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రమైన ఆర్డీవో కార్యాలయంను సిపి విష్ణు వారియర్ పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావడంతో నియమావళిలోని ఆంశలను పరిగణంలోకి తీసుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ... వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకొని మరియు ఆర్టీపిసిఆర్ టెస్టు చేసుకున్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు.
ఓటర్లు ఆందోళన చేందకుండా ప్రశాంతవంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కువినియోగించుకునేందుకు వీలుగా పోలీసులు స్వేచ్చయుత వాతావరణం కల్పించారు. ఈ బందోబస్తులో డీసీపీలు 2, అడిషనల్ డీసీలు 3, ఏసీపీలు 10, సీఐలు 22, ఎస్సై 46, మొత్తం 1015 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసీపీ సుభాష్ చంద్ర బోస్, ఏసీపీలు అంజనేయులు, రామోజీ రమేష్ , ప్రసన్న కుమార్ , వెంకటస్వామి, సిఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.