Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. కల్లూరు డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆర్డీవో కార్యాలయాల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయగా భారీ బందోబస్తు మధ్య స్థాని సంస్థల పోలింగ్ నిర్వహించారు. నోడల్ అధికారి ఆర్డీవో సిహెచ్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పోలింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యింది. తొలి ఓటు స్వతంత్ర అభ్యర్థి కొండపల్లి శ్రీనివాసరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కాంగ్రెస్‌కు చెందిన 12 మంది టీఆర్ఎస్కు చెందిన ఒకరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 14 ఓట్లు పది గంటల వరకు పోలయ్యాయి. ఒంటి గంటకు మూడు బస్సుల్లో ఖమ్మం నుంచి టీఆర్ఎస్కు చెందిన జడ్పీటీసీలు ఎంపీపీలు, ఎంపీటీసీలు పోలింగ్ కేంద్రానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి చేరుకున్నారు. పది మంది చొప్పున పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య తన ఓటు హక్కును కల్లూరు కేంద్రంలో వినియోగించుకున్నారు. మొత్తం 115 మంది ఓటర్లు ఉండగా 114 మంది తమ ఒటు హక్కు వినియోగించుకోగా ఒకరు మాత్రమే గైర్హాజరయ్యారని నోడల్ అధికారి సిహెచ్ సత్యనారాయణ తెలిపారు.
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు డీసీపి ఎల్సీ నాయక్ ఆధ్వర్యంలో ఏసీపీలు వెంకటేష్ సంతోష్‌కుమార్ ఆరుగురు సీఐలు 11మంది ఎస్ఐలు 120 మంది పోలీసు బందోబస్తు నిర్వహించారు.