Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా జమాత్-ఎ-ఇస్లామి హింద్, (జెఐహెచ్) ఖమ్మం (అర్బన్) ఆర్గనైజర్ ఎమ్.డి. అబ్రార్ అలీ, జిల్లా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎమ్.పి.జె.,) అధ్యక్షుడు షేక్ ఖాసిమ్ సాహెబ్‌లు తమ బృందంతో ఖమ్మం కోర్టులో జిల్లా (ఇన్ ఛార్జ్) జడ్జి పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ సమాజ మనుగడకు మానవ హక్కులు అనేవి ఎంతో అవసరం అని, వాటిని కాపాడవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని తెలిపారు. జె.ఐ.హెచ్, ఎమ్.పి.జె చేస్తున్న పేదలకు సరుకుల పంపిణీ, పేద ఖైదీ లను జైలు నుండి విడిపించుట, అవసరమైన వారికి న్యాయ సేవలు ఆందించుట తదితర సేవా కార్యక్రమాలను తెలుసుకుని అభినందించారు. సభ్యులు సీనియర్ సివిల్ జడ్జి, లీగల్ సెల్ అథారిటీ కార్యదర్శి జావీద్ పాషా ను కలిశారు. ఈ కార్యక్రమంలో ఎమ్.పి.జె., జిల్లా కోశాధికారి ఎమ్.డి. హకీమ్ తదితరులు పాల్గొన్నారు.