Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీపీఈటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేశ్వరరావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ప్రైవేటు ఎలక్ట్రికల్ టెక్నిషియన్లుగా పనులు చేస్తున్న ప్రతి కార్మికుడు విధిగా లేబర్ కార్డు కలిగి ఉండాలని టీపీఈటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెన్నోజు రాజేశ్వరరావు అన్నారు. శుక్రవారం చిన్ననల్లబల్లి గ్రామంలో జరిగిన ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నిషయన్ ఫెడరేషన్ మండల కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులు విధిగా నెల నెలా సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఎలక్ట్రిషన్ విధులను బాద్యతతో నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా ఈనెల 19వ తేదీన సూర్యాపేటలో జరిగే సంఘ సమావేశాల కర పత్రాన్ని విడుదల చేశారు. అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్ష, కార్యదర్శులుగా రాయపూడి సూరిబాబు, వందవాసు రాముతో పాటు ఉపాధ్యక్షులుగా బిల్లపాటి రాజు, కోవాధికారిగా ముక్కెర రాంబాబు, సహాయ కార్యదర్శిగా తోట రమేష్:, గౌరవ అధ్యక్షులుగా పుట్టా శ్రీరామూర్తి, సలహాదారునిగా తెల్లం హరికృష్ణ కార్యవర్గ సభ్యులుగా గౌరారపు సాంబశివరావు, నిట్టా అబ్బులు, కె. నరేందర్, శెట్టి గోపి, నవీన్, ప్రకాష్, రాజేష్‌లతో పాటు పలువురిని ఎన్నుకున్నారు. సమావేశంలో భద్రాచలం మండల అద్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.