Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
ఆశా వర్కర్స్కు కోవిడ్ రిస్కు అలవెన్స్ రూ.10,000 ఇవ్వటాన్ని కేంద్ర ప్రభుత్వం నిలుపి వేయటంపై దేశవ్యాప్త అశావర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆశావర్కర్లుతో కలిసి ఎర్రగుంట ఆరోగ్య కేంద్రం ముందు చేసి ధర్నా చేసి, మాట్లాడారు. ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మి, ముంతాజ్, రమాదేవి, వ్వెంకటలక్ష్మి, లక్ష్మి, సీత తదితరులు పాల్గొన్నారు.
పాల్వంచ : ఆశావర్కర్లకు వెంటనే రిస్క్ అలవెన్స్‌ని యధావిధిగా కొనసాగించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు, పాల్వంచ పట్టణ, మండల కన్వీనర్ గూడెపూరి రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పాల్వంచ కేటీపీఎస్ కాలనీ గేట్ నుండి బస్టాండ్ సెంటర్ మీదుగా ర్యాలీ బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డీటీకి అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడారు. ఇది కేవలం తాత్కాలిక పోరాటం మాత్రమే అని, సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారి సందర్భంగా హెచ్చరించారు. ఈ ర్యాలీ ధర్నా కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు మరియమ్మ, పద్మ, బుజ్జమ్మ, కొండమ్మ, సుజాత, సువార్త, అరుణమ్మ, పార్వతి, విజయ, సైదాబీ తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : ఆశా వర్కర్స్కు కోవిడ్ రిస్కు అలవెన్స్ రూ.10వేలకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఆశ వర్కర్స్ కోవిడ్ రిస్క్ అలవెన్స్‌లను నిలుపి వేయటంపై దేశవ్యాప్తంగా అశావర్కర్స్ యూనియన్ నిరసన కార్యక్రమాల పిలుపులో భాగంగా చండ్రుగొండ ప్రాథమిక వైద్యశాల ముందు ధర్నా చేసి అనంతరం మెడికల్ ఆఫీసర్ రాకేష్‌కి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు విప్పర్లపెద్ద వెంకటేశ్వర్లు, ఆశా కార్యకర్తలు రుక్మిణి, కుమారి, పద్మ తదితరులు పాల్గొన్నారు.