Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం ఎర్రబోడులో ప్రేమికుడి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న త్రిష కుటుంబానికి సీపీఐ(ఎం) ఎర్రబోడు గ్రామ శాఖ గురువారం 11వేల ఆర్ధిక సహాయం అందజేసింది. ఈ సందర్బంగా సీపీఐ(ఎం) మండల నాయకులు వజ్జా రామారావు, పండగ కొండయ్యలు మాట్లాడుతూ త్రిష మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని, ఆమాయకులైన బాధిత ఆదివాసీ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి, రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు కుర్సం శ్రీను, కాటేపల్లి నవీన్, బోజెడ్ల గోవిందరావు, కుంజా వెంకన్న పాల్గొన్నారు.