Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 125 ఏండ్ల చరిత్ర సింగరేణిది
- కార్మిక హక్కుల కోసం పోరాడుదాం
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ- సత్తుపల్లి
సింగరేణి సంస్థను ప్రయివేటీకరించడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిప్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రయివేటీకరణ, నాలుగు బొగ్గు బ్లాకుల ప్రయివేటీకరణను నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక సంఘాలు మూడు రోజుల పాటు చేపట్టిన సమ్మెకు ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వారి వద్దకు వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ నల్లబంగారంగా పిలువబడే 125 ఏండ్ల చరిత్ర సింగరేణికి ఉందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి సంస్థ ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వం కేంద్రప్రభుత్వంతో పోరాడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే రఫీ, కౌన్సిలర్లు ఎస్కే చాంద్‌పాషా, సూరిబాబు, టీజీబీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీహెచ్ఎస్ సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.