Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
ఈ నెల 1వ తేదీన వైరా ఇందిరమ్మ కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హౌసింగ్ కార్పొరేషన్ విశ్రాంత అసిస్టెంట్ ఇంజినీర్ వేము ఏసుదాసు (59) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు. డిసెంబర్ 1 వ తేదీ సాయంత్రం తన ద్విచక్ర వాహనం పై ఇందిరమ్మ కాలనీ వైపు వెళుతుండగా ఎదురు గా వచ్చిన ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢకొీన్న సంఘటనలో ఇరువురికి గాయాలైనవి. వేము ఏసుదాసు తలకు తీవ్ర గాయమై ఆ వెంటనే కోమాలోకి వెళ్ళారు. అప్పటి నుండి ఒక ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు. ఏసుదాసు సీపీఎం ఉద్యమ శ్రేయోభిలాషిగా ఉన్నారు. విద్యార్థిగా ఎస్ఎఫ్ఐలో నాయకుడిగా చురుకైన పాత్ర నిర్వహించారు. హాస్టల్లో ఉంటూ భోజన సమస్యల పై విద్యార్థులను సమీకరించి ఆందోళనలు నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపారు. అనంతరం హౌసింగ్ కార్పొరేషన్లో వర్క్ ఇన్స్పెక్టర్గా చేరి పనిచేస్తూ అసిస్టెంట్ ఇంజినీర్‌గా గత జనవరిలో రిటైర్ అయ్యారు.ఈ కాలంలో వర్క్ ఇన్స్పెక్టర్ల, ఇంజనీర్ల అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత వైరా మునిసిపాలిటీ లో భాగమైన లాలాపురం స్వగ్రామం కాగా వైరా సుందరయ్య నగర్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు,కుమార్తె ఉన్నారు. ఏసు దాసు మరణవార్త తెలుసుకుని రాజకీయ నాయకులు,ఆయన అభిమానులు బంధువులు పెద్ద సంఖ్యలో చేరుకుని నివాళులర్పించారు.ఆదివారం సాయంత్రం స్వగ్రామం లాలా పురంలో అంత్యక్రియలు నిర్వహించారు.