Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
మధ్యాహ్న భోజన వర్కర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఏన్కూరు మండల కమిటీ సమావేశం నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోన వల్ల గత రెండు సంవత్సరాలుగా పిల్లలకు చదువు లేక కరోనా భయంతో తల్లిదండ్రులు భయపడుతుంటే పౌష్టికాహారం అందించాల్సిన ప్రభుత్వాలు అందించకుండా మధ్యాహ్న భోజనం వండి పెట్టే వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా వారు పెట్టిన ఖర్చులు చెల్లించకుండా వారే వంట మానుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉన్నాయని ఆయన అన్నారు. పేద దళిత గిరిజన విద్యార్థులను దష్టిలో పెట్టుకొని వెంటనే మధ్యాహ్న భోజన వర్కర్ల బిల్లులను విడుదల చేయాలని, బడ్జెట్ను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సంగం మండల కార్యదర్శి ఇటికాల లెనిన్, సిఐటియు మండల కన్వీనర్ వై రాములు తదితరులు పాల్గొన్నారు.