Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
అమ్మపేట గ్రామానికి చెందిన సిపిఐ(ఎం) సానుభూతిపరులు, శతాధిక వృద్ధురాలు దండా అన్నపూర్ణమ్మ(100) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందింది. సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు వాసిరెడ్డి వరప్రసాద్, పార్టీ మండల కార్యదర్శి బట్టు పురుషోత్తంలు అన్నపూర్ణమ్మ మృతదేహాన్ని సందర్శించి పుష్పగుచ్చాలుతో నివాళులర్పించారు. ఆమె మృతికి గల కారణాలను ఆమె కుమారుడు దండా వెంకటేశ్వర్లును వారు అడిగి తెలుసు కున్నారు. అన్నపూర్ణమ్మకు నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు దండా వెంకటేశ్వర్లు గతంలో సిపిఐ(ఎం) గ్రామశాఖ మాజీ కార్యదర్శిగా రెండు పర్యాయాలు పని చేశారు. ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వారు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ(ఎం) మండల నాయకులు కందుల భాస్కర రావు, వేల్పుల భద్రయ్య, సిపిఐ(ఎం) గ్రామశాఖ కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వరరావు, నాయకులు నంబూరి వెంకటేశ్వర్లు, అన్నపూర్ణమ్మ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.