Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామంలో 573, 574 సర్వేనెంబర్లో ఉన్న పదహారు ఎకరాల వక్ఫ్ భూములను (పీర్లమాన్యం) అమ్మడమే ఇరువురి లక్ష్యంగా కనబడుతోందనే వ్యాఖ్యలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఒక్కొక్క ఎకరం భూమి కోట్ల రూపాయలు పలకుతుండంతో అ భూములను సాగుచేసుకుంటున్న రైతులు, భూములకు వారసులుగా ఉంటున్న వారికి డబ్బులపై ఆశ పెరిగి అమ్మేందుకు పలుదఫాలుగా బేరాలు కుదరించుకున్నారనే ఆరోపణలు వ్యక్తమౌతున్నాయి. గతంలో మండల కేంద్రానికి అతిసమీపంలో ఉండే ఓ వెంచర్ నిర్వహకుడు భూములను కొనుగోలు చేసి పది లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అ తర్వాత భూములు పీర్లమాన్యం పేరుతో ఉండటంతో రిజిస్ట్రేషన్ కావనే విషయం తెలుసుకొని అడ్వాన్స్ ఇచ్చిన వెంచర్ నిర్వాహకుడు డబ్బులను వెనక్కి తీసుకున్నాడనే వినికిడి. ఇది ఇలా ఉండగా గతకొద్ది రోజుల క్రితం ఖమ్మం పట్టణానికి చెందిన వ్యక్తికి మరోసారి ఈ వక్ఫ్ భూములను అమ్మకానికి పెట్టారని ఇందుకు సంబంధించి వన్ భై ఫోర్తు ప్రకారం డబ్బులు చెల్లించాడని గ్రామంలో పుకార్లు పొక్కడంతో మరోసారి ఈ వక్ఫ్ భూముల వ్యవహారంపై గ్రామస్తులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. సాగుచేసుకునే రైతులు, ముత్తవల్లి వారసులు ఒకరికి తెలియకుండా ఒకరు గుట్టుచప్పుడు కాకుండా భూములు అమ్మకానికి పెట్టడంతోనే విషయం బయటకు వస్తుందని గ్రామంలో చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు, మైనారిటీ నాయకులు ఆక్రమణకు గురౌతున్న పీర్లమాన్యం భూములు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.