Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంరూరల్
ప్రమాదంలో గాయపడిన భవన నిర్మాణ కార్మికుడిని ఆదుకోవాలని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముదాం శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం నగరంలోని పాకబండ బజార్లో ఇల్లు నిర్మాణం కోసం యజమాని లారీలో ఇసుక తీసుకరాగా ఆ లారీ తగిలి రాములు అనే కార్మికుడు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ కార్మికుడికి బిల్డర్ వైపునుంచి ఎటువంటి సాయమూ అందలేదు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో గాయపడ్డ కార్మికుడిని పరామర్శించారు. ఆదివారం జేఏసీ ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్ లో సమావేశం నిర్వహించి కార్మికుడికి న్యాయం జరిగే వరకు పోరాడాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు, ఏఐటియుసి, బహుజన సంఘం, ఎఫ్టియు సంఘాలు పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు దోనోజు లక్ష్మయ్య, మేడికొండ నాగేశ్వరరావు, అమర బోయిన లింగయ్య, టీవీ రమణ రమణ, పేరబోయిన వెంకన్న, నకిరేకంటి సంజీవరావు, వీరేశం, శెట్టి వెంకన్న, పురాణం వెంకన్న, గూడ బ్రహ్మం, కుమారస్వామి, గాదె లక్ష్మీనారాయణ, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.