Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీపీ వెంకట్రావు
నవ తెలంగాణ- ఖమ్మంరూరల్
ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఏసీపీ వెంకట్రావు అన్నారు. మండల పరిధిలో పోలేపల్లిలోని సాయినగర్ కాలనీలో సాయిబాబా ఆలయ సమీపంలోని ఫంక్షన్హాల్లో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ జిల్లా సర్వసభ్య సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు.కోవిడ్ తో ఇబ్బందులు పడిన కుటుంబాలకు,ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు ఎన్ఆర్ఐ అసోసియేషన్ అందించిన సేవల గురించి కొనియాడారు. అసోసియేషన్ బాధ్యులు యలమద్ది వెంకటేశ్వర్లు(వైవీ) మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రికి బెడ్స్ అందజేయడం,చిరాగ్ ఫౌండేషన్ తరుపున రూ.22 లక్షల విలువ గల ఆక్సీజన్ కాన్సంట్రేటర్లు అందజేయడం జరిగిందన్నారు. సభ్యులందరి సహకారంతోనే సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు.ఫంక్షన్‌హాల్ కు రూ.20వేల విలువగల కుర్చీలను వితరణగా అందజేశారు.అనంతరం 2021-23 ఏడాదికి గాను జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలు స్వరూపరాణి, కార్యదర్శి హిమబిందు మరో 15 మందితో కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు యలమద్ది వెంకటేశ్వర్లు,(వైవీ) తెలిపారు. కార్యక్రమంలో నాగప్రసాద్, కిషన్ రావు, శ్రీనివాసరావు, పురుషోత్తం, రమణరావు, వెంకటేశ్వరరావు, లక్ష్మణమూర్తి, తాతా రాఘవయ్య పాల్గొన్నారు.