Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాతలను అభినందించిన సర్పంచ్
నవతెలంగాణ-రఘునాథపాలెం
కోయచలక గ్రామానికి చెందిన మద్దాల హుస్సేన్, జయమ్మ దంపతులు ఆదివారం గ్రామ పెద్దల సమక్షంలో 250 గజాల స్థలాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మించడానికి వితరణ చేశారు. ఈ స్థలం విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. అనంతరం దాతలను సర్పంచ్ మాధంశెల్టి హరిప్రసాద్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు చెరుకూరి బిక్షమయ్య, తోట నర్సయ్య, తోట వెంకటేశ్వర్లు, గ్రామ విశ్వ బ్రాహ్మణ, కుటుంబ పెద్దలు వీరభద్రం, కృష్ణచారి, శ్రీను, రామ, బ్రహ్మం, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, సత్యం తదితరులు, పాల్గొన్నారు.